Deepika Pilli: నాకు కథ కూడా చెప్పలేదు 3 d ago

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి కాంబినేషన్లో వస్తున్న 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దీపిక పిల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అసలు ఫస్ట్ నాకు వీళ్లు కథ చెప్పలేదు. నితిన్, భరత్, ప్రదీప్ వీళ్లందరితో నాకు మంచి స్నేహ బంధం ఉండడంతో నాకు కథ చెప్పకుండా సినిమా తీద్దాం అనుకుంటున్నాము అనగానే నేను చాలా ఎగ్జెట్ అయ్యి ఓకే చెప్పేశాను. నేను ఈ సినిమాలో రాజకుమారి అనే పాత్రలో కనిపిస్తాను.